ఆస్ట్రేలియాలో 'పెద్ది' రికార్డు... తొలి చిత్రంగా అరుదైన ఘనత

  • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ ఓవర్సీస్ రిలీజ్
  • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల
  • ఆస్ట్రేలియాలోని అన్ని హోయిట్స్ లోకేషన్లలో రిలీజ్
  • ఇలా విడుదలవుతున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డు
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రత్యంగిరా ఓవర్సీస్ పంపిణీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' చిత్రం విడుదల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, ఓవర్సీస్‌లో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. అక్కడి ప్రముఖ సినిమా చైన్ 'హోయిట్స్'కు సంబంధించిన అన్ని లొకేషన్లలోనూ విడుదల కానున్న తొలి చిత్రంగా 'పెద్ది' చరిత్ర సృష్టించనుంది.

ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ దేశాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా ఓవర్సీస్ పంపిణీ చేస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలు కూడా ఎంపిక చేసిన కొన్ని హోయిట్స్ థియేటర్లలో మాత్రమే విడుదలవుతాయి. కానీ, 'పెద్ది' చిత్రాన్ని ఆస్ట్రేలియాలోని అన్ని హోయిట్స్ సెంటర్లలోనూ ప్రదర్శించనుండటం విశేషం. ఇది తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ విడుదల ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Janhvi Kapoor
AR Rahman
Australian Theaters
Hoyts Australia
Telugu Cinema
Overseas Release
Mythri Movie Makers

More Telugu News